పవన్ కల్యాణ్… ఈ వీడియోలూ మార్ఫింగ్ వేనా?: గల్లా జయదేవ్ సూటి ప్రశ్న

మార్ఫింగ్ ఆరోపణలపై స్పందించిన జయదేవ్
సమావేశాల్లో పవన్ కూడా ఉన్నారు
హామీలపై వెనక్కు తగ్గిన మోదీ
ప్రశ్నించడానికి ఇది చాలదా? అని ఎద్దేవా
గతంలో ప్రధాని మాట్లాడిన ప్రసంగాలను మార్ఫింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.

“పవన్ కల్యాణ్ గారూ… మీరు కూడా ఈ మీటింగుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యం. మీరు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడానికి ఇది సరిపోదా? ఆయన తన హామీలపై వెనక్కు తగ్గలేదా? మీరు కూడా అందుకు సాక్షే. ఈ వీడియోలను కూడా మార్ఫింగ్ చేశారా?” అని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలో ప్రధాని ప్రసంగిస్తున్న వేళ, ఆయనకు సమీపంలో తన తల్లి గల్లా అరుణ కుమారి కూడా కూర్చుని ఉన్నారని, అన్ని మీడియా చానళ్ల వద్దా మోదీ ప్రసంగం ఫుటేజ్ లు ఉన్నాయని గుర్తు చేశారు.

Related posts

Leave a Comment