పరశురామేశ్వర ఆలయం- భువనేశ్వర్

Parasurameswar_temple_linga (1)

పరశురామేశ్వర ఆలయం ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ నందు గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం క్రీ.శ 7 మరియు 8 ల మధ్య కాలంలోని శైలోద్భవుల కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవo శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం క్రీ.శ 670 లో నగర శైలిలో నిర్మితమైనది. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒడిషా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.

Parasurameswar_temple_linga (1)పరశురామేశ్వర దేవాలయం లో “విమానం” , “గర్భగుడి” మరియు “బాడ” ఉన్నవి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉన్నది. ఈ శిఖరం 40.25 అ.  ఎత్తు కలిగి ఉన్నది. ప్రాచీన దేవాలయాలలో ఒకేఒక విమానం కలిగి ఉన్న దేవాల యాలకన్న “జగన్మోహన”(భక్త మందిరం)  అనే అదనపు నిర్మాణము కలిగిన మొదటి దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినప్పటికీ,ఇది శక్తాలయాల లో భాగమైన దేవతల శిల్పాలను కలిగి ఉన్నది. సప్తమాత్రికలైన చాముండ, వరాహి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, శివాని మరియు బ్రహ్మి చిత్రాలను కలిగి ఉన్న మొదటి దేవాలయం. ఈ దేవాలయం ప్రస్తుతం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే (ASI) ద్వారా నిర్వహింపబడుతున్నది. ప్రతి సంవత్సరం జూన్ మరియు జూలై నెలలలో పరాశురాష్ఠమి అనే ప్రధాన పండుగను ఈ దేవాలయంలో జరుపుతుంటారు. ఆలయ శిల్పాలలో ముఖ్యంగా వివిధరకాల ఫలాలు, పూలు, పక్షులు మరియు జంతువుల దృశ్యాలు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబడినవి. శిల్పాలలో వలెనే పక్షుల తోక వెనుక భాగంలో పూల దిజైన్లు ఉన్నాయి. ముక్తేశ్వర దేవాలయం వలెనే జాడీ మరియు పూలతో కూడిన కళాకృతులు కలిగి యున్నది.

చరిత్ర: చరిత్రకారుల ప్రకారం, ఈ దేవాలయం 8 శతాబ్ద మొదట్లో నిర్మించినట్లు తెలియుచున్నది. ఇదే విధమైన దేవాలయాలైన శత్రుఘ్నేశ్వర్, భరతేశ్వర్ అంరియు లక్ష్మణేశ్వర్ దేవాలయాలు 7వ శతాబ్ద చివరిలో కట్టినట్లు తెలియుచున్నది. కానీ ప్రముఖ చరిత్రకారుడు కె.సి.పాణిగ్రాహి ఈ దేవాలయం క్రీ.శ 650 లో నిర్మితమైనట్లు తెలియజేశారు. అనేక మంది పండితులు ఈ దేవాలయ నిర్మాణం మరియు అంతర గర్భాలయంలో ఎనిమిది గ్రహాలను ఒక తలుపుపై చిత్రించుటను బట్టి దీని కాలాన్ని ఏడవ శతాబ్ద మధ్య కాలానిదిగా అంగీకరించారు. ఎందుకంటే తర్వాత కాలంలోని దేవాలయాలలో తొమ్మిది గ్రహాలు ఉన్నట్లు చిత్రీకరణలున్నవి.ఈ దేవాలయాన్ని “శివుడు” కులదైవంగా భావించిన “శైలోద్భవులు” నిర్మించిరారు. ఈ దేవాలయం 1903 లో బాగుచేయబడినది. ఈ కాలంలో అంతర గర్భాలయం లోని పైకప్పును అసలు నిర్మాణ శైలిలో నిర్మించారు.

 

Related posts

Leave a Comment