నేనే పార్టీలో లేను.. ఎందులోనూ చేరను: ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ దాదాపు గంటకు పైగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంపై తాను గతంలో రాసిన లేఖపై చర్చించేందుకే సీఎం పిలిపించారని ఉండవల్లి తెలిపారు. పార్లమెంటులో దీనిపై ఎలా వ్యవహరించాలో సీఎంకు సలహా ఇచ్చినట్లు తెలిపారు. విభజన బిల్లును తలుపులు మూసి ఆమోదించారని గతంలో మోదీనే అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని పార్లమెంట్‌లో చర్చకు నోటీసు ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. అలాగే, విభజన జరిగిన తీరుపై తాను రాసిన పుస్తకాన్ని చంద్రబాబుకు అందజేశానన్నారు. విభజన బిల్లు ఆమోదం తీరు చట్టవిరుద్ధమన్నారు. విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పేర్కొంటూ స్వల్ప కాలిక చర్చకు నోటీసు ఇవ్వాలని చెప్పానన్నారు. పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో కొన్ని సూచనలు ఇచ్చానని, నిర్ణయం వారిదేనని ఉండవల్లి తెలిపారు. తానే పార్టీలో లేనని, ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టంచేశారు. వైకాపా ఎంపీల రాజీనామాలు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

Related posts

Leave a Comment