నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు.

‘సురక్షిత’ ప్రాంతాలకు శాసనసభ్యుల తరలింపు!
యడ్డీ ప్రమాణ స్వీకారానికి ముందే సరిహద్దులు దాటనున్న ఎమ్మెల్యేలు
రాష్ట్రంలోనే ఉంటే దాడులు చేయించి బయటకు తీసుకు వస్తారని అనుమానం
మరి కాసేపట్లో హైదరాబాద్‌కు జేడీఎస్ ఎమ్మెల్యేలు?
రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న వేళ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్‌లు పడరాని పాట్లు పడుతున్నాయి. ఎమ్మెల్యే పక్క చూపులు చూడకుండా సరిహద్దులు దాటించి ‘సురక్షిత’ ప్రాంతాల్లో ఉంచాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ వారు రాష్ట్రంలో ఉంటే కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న కాంగ్రెస్-జేడీఎస్‌లు ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేలను సరిహద్దులు దాటించాలని నిర్ణయించాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే బెంగళూరు శివారులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్‌కు పంపగా, జేడీఎస్ ఎమ్మెల్యేలు నగరంలోని షంగ్రిల్లా హోటల్‌లో ఉన్నారు. అయితే, జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదాబాద్‌కు పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. రాష్ట్రంలో ఉంచితే పోలీసుల ద్వారా దాడులు చేయించి వారిని విడిపిస్తారన్న అనుమానంతో సరిహద్దులు దాటించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరి కాసేపట్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ల్యాండవనున్నారు.

Related posts

Leave a Comment