నీరు ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే ఇది చదవాల్సిందే!

  • అవసరానికి మించి నీరు తాగితే ఓవర్ హైడ్రేషన్ కలుగుతుంది
  • శరీరంలో, రక్తంలో సోడియం నిల్వలు పడిపోతాయి
  • మెదడు వ్యాపుకు గురయ్యే అవకాశం

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత మేరకు మంచి నీరు తాగాలన్న సంగతి తెలిసిందే. దీని వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ కు గురై, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం తలెత్తుతుంది. నీరు తాగమన్నారు కదా అని… లీటర్లు లీటర్లు తాగినా ప్రమాదకరమే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త ఛార్లెస్ బోర్క్.

అవసరానికి మించి మంచి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోయి, ఓవర్ హైడ్రేషన్ కు దారితీస్తుంది. ఓవర్ హైడ్రేషన్ కారణంగా శరీరంలో, రక్తంలో సోడియం నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. దీన్నే వైద్య పరిభాషలో హైపోనేట్రీమియా అంటారు. దీని వల్ల మెదడు వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు మెదడు వాపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సీజర్స్ (ఫిట్స్) వచ్చే అవకాశం కూడా వుంది. మెదడు దెబ్బతినడం, హా

Related posts

Leave a Comment