నా పెళ్లి విషయాన్ని దాచిపెట్టాము .. అది కాస్త అలా బయటపడింది: కేఆర్ విజయ

అలా ఆయనతో పరిచయమైంది
అది కాస్త ప్రేమగా మారింది
సిలోన్ వెళ్లొస్తూ కెమెరా కంటికి చిక్కాము
తెలుగు తెరకి పరిచయమైన దగ్గర నుంచి వరుస అవకాశాలను అందుకుంటూ కేఆర్ విజయ దూసుకుపోయారు. ఆనాటి అగ్రకథానాయికలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు.

“మా వారు కష్టపడి పైకొచ్చారు .. చాలా శ్రీమంతుడయ్యారు. హోటల్స్ బిజినెస్ ఉండేది .. సొంత షిప్పు .. విమానం ఉండేవి. ఆయన ఫైనాన్స్ చేసిన ఒక సినిమాలో నేను నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నాం. నేను సినిమాలతో బిజీగా ఉండటం వలన నా పెళ్లి విషయం బయటికి చెప్పకుండా దాచిపెట్టాము. ఒకసారి ఇద్దరం కలిసి సిలోన్ వెళ్లాము .. అప్పుడు ఫ్లైట్ నుంచి దిగుతుండగా ఎవరో మమ్మల్ని ఫొటో తీశారు. హనీమూన్ వెళ్లి వచ్చారంటూ నెక్స్ట్ డే ఆ ఫోటో అన్ని పేపర్లలో వచ్చేసింది .. అలా మా పెళ్లి విషయం బయటికి వచ్చేసింది” అని చెప్పుకొచ్చారు.

Related posts

Leave a Comment