నవరత్నాల పేరుతో కలకాలం గుర్తుండేలా..

వైసీపీ అధికారంలోకి వస్తే.. విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. డ్వాక్రా మహిళల అప్పు మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామన్నారు. చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకే పాదయాత్ర చేపట్టాన్న జగన్‌.. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. వైసీపీ అధినేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. యువనేతను కలిసేందుకు తరలివస్తున్న అభిమానులు.. ఆయనతో కలిసి అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయన్ను చూసేందుకు జనం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. బుధవారం నాగుల్లంక శివారు నుంచి పాదయాత్ర కొనసాగించిన జగన్‌.. 9.9 కిలోమీటర్లు నడిచి రాజోలు చేరుకున్నారు. ఇప్పటివరకు 2,39 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

ప్రజాసంకల్ప యాత్రలో జనంపై హామీల వర్షం కురిపిస్తున్న జగన్‌.. నవరత్నాల పేరుతో కలకాలం గుర్తుండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల అప్పు మాఫీ చేయడంతో పాటు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామన్నారు. ఇల్లులేని ప్రతి పేదకూ పక్కా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

నేటితో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజుకు చేరింది. ఇవాళ రాజోలు నుంచి మొదలుకానున్నపాదయాత్ర.. లక్కవరం క్రాస్‌ మీదుగా చింతలపల్లి వరకు కొనసాగుతుంది.

Related posts

Leave a Comment