‘నన్ను కిడ్నాప్‌ చేశారు..’ అంటూ సోదరికి మెసేజ్‌ చేసిన విద్యార్థిని.. కడప పోలీసులగాలింపు!

చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
యువతి అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు
బృందాలుగా ఏర్పడి పోలీసుల గాలింపు
కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అలజడి చెలరేగుతోంది. ఓ యువతి తాను కిడ్నాప్‌కు గురైనట్లు, కిడ్నాపర్లు తనను ఆటోలో తీసుకు వెళుతున్నట్టు తన సోదరికి మెసేజ్‌ పెట్టింది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిన్న చౌక్‌ పోలీస్‌స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు నిర్మల్‌ నర్సింగ్‌ కాలేజీలో ఫార్మసీ చదువుతున్నట్లు తెలిసింది. యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న చిన్న చౌక్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఆమె పంపిన మెసేజ్‌ ఆధారంగా ఆ యువతి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

Leave a Comment