దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్న కేసీఆర్: ఉత్తమ్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని, అందుకు ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన త్న ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “మొదట జగ్గారెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పిరికితనాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఏ నేతనూ ఎదుర్కొనే శక్తిలేని వారు, ఇలా దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్నారు. అతి త్వరలోనే తెలంగాణ నిరంకుశ పాలన నుంచి బయట పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఐకమత్యంగా ఉండి టీఆర్ఎస్ ను ఎదిరించి పోరాడతారు” అని ఆయన అన్నారు
Tags: slams,uttam kumar,revanth reddy, it dhadulu

Related posts

Leave a Comment