దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపుల బంద్

ఆన్ లైన్ లో మందులు అమ్మకంపై నిరసన
ఏఐఓసీడీ పిలుపు మేరకు బంద్
మద్దతిచ్చిన ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్
దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందులు అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (టీటీసీడీఏ) మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

Leave a Comment