దుబాయ్ మ్యాచ్ లో ‘జనసేన’ జెండాల ప్రదర్శన

దుబాయ్ లో పవన్ వీరాభిమానులు
మ్యాచ్ లో జనసేన జెండాల ప్రదర్శన
పలుమార్లు కనిపించిన జనసేన పతాకం
నిన్న దుబాయ్ లో జరిగిన భారత్, హాంకాంగ్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, పవన్ కల్యాణ్ వీరాభిమానులు జనసేన జెండాతో హల్ చల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. ఆయన అభిమానులు దుబాయ్ లో కూడా ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్న వేళ, జనసేన జెండాలను గ్యాలరీల్లో వీరు ప్రదర్శించారు. భారత క్రికెట్ జట్టు వీరాభిమానులు కూర్చున్న ప్రాంతంలోనే ఉన్న పవన్ అభిమానులు, ఈ జండాను ఊపుతూ హడావుడి చేయడంతో, క్రికెట్ మ్యాచ్ జరిగిన సమయంలో పలుమార్లు జనసేన పతాకం కనిపించింది.

Related posts

Leave a Comment