దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీ.. పెరగనున్న ధరలు

  • ప్రస్తుతం 15 శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీ
  • 20 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటన
  • ఐఫోన్‌ ధరలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ పెరిగే అవకాశం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచుతున్నట్లు ఆయన ప్రకటన చేసి, ప్రస్తుతం 15శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 20 శాతానికి పెంచుతున్నట్లు వివరించారు.

దీంతో మొబైల్‌ఫోన్‌ ధరలు పెరగనున్నాయి. శాంసంగ్‌, షియోమి వంటి విదేశీ మొబైల్‌ కంపెనీలు భారత్‌లో ఇప్పటికే తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఐఫోన్‌ ధరలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా భారత్‌లోనే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు కావాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Related posts

Leave a Comment