దబాంగ్ టూర్ లో కత్రినాకు క్లాస్ పీకిన మహిళ!

  • వాంకోవర్ పర్యటనలో సంఘటన
  • సెల్ఫీల కోసం  కత్రినాను చుట్టుముట్టిన అభిమానులు
  • కొందరికే అవకాశమిచ్చి.. మిగిలిన వారికి ‘నో’ చెప్పిన వైనం

దబాంగ్ టూర్ లో భాగంగా వాంకోవర్ లో పర్యటిస్తున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆమెను చుట్టుముట్టిన క్రమంలో కత్రినా ఒకింత అసహనం వ్యక్తం చేసింది. వేదిక వద్దకు కత్రినా వెళుతుండగా ఆమెతో కలిసి సెల్పీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. దీంతో, కొందరికి మాత్రమే తనతో సెల్ఫీలు దిగేందుకు  కత్రినా అంగీకరించింది. మిగిలిన అభిమానులు కూడా ఆమెతో సెల్ఫీలు దిగుతామనడంతో కత్రినా వారిని మందలించింది.

‘ఇలా చేయొద్దు, నేను అలసిపోయానని తెలుసు కదా. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి’ అని వారితో కత్రినా చెప్పింది. ఈ వ్యాఖ్యలకు బాధపడ్డ ఓ మహిళా అభిమాని.. ‘మీ ప్రవర్తన మార్చుకోండి. పెద్ద హీరోయిన్ అని చెప్పుకుంటారుగా, అభిమానులు ఆసక్తితో మీ దగ్గరికొస్తే ఇలా కసురుకోవడం తగదు’ అని బదులిచ్చింది.

ఈ క్రమంలో కత్రినా ఆ మహిళతో గొడవకు దిగినట్టు సమాచారం. దీంతో, అక్కడే ఉన్న కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకుని ఆ మహిళను వారించారు. అయినప్పటికీ, ఏమాత్రం తగ్గని ఆ మహిళ ‘మీకోసం ఎవరూ రాలేదులే, మేమంతా సల్మాన్ కోసం వచ్చాం..’ అంటూ ఆ మహిళ దీటుగా సమాధానమిచ్చింది.

Related posts

Leave a Comment