‘త్వరలో వస్తున్నా’నంటున్న శ్రుతి

im coming soon shruthi hassan

* గత కొంత కాలంగా కథానాయిక శ్రుతి హాసన్ సినిమాలలో కనిపించని సంగతి విదితమే. డిమాండ్ వున్నప్పటికీ అమ్మడు సినిమాలు చేయడం లేదు. దీనిపై శ్రుతి తాజాగా స్పందించింది. ‘కావాలనే సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఈ సమయంలో ఎంతో తెలుసుకున్నాను. నన్ను నేను అర్థం చేసుకునే అవకాశం కూడా కలిగింది. త్వరలోనే మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకుని, మీ మధ్యకు వస్తాను’ అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
* విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం ఇటీవలి కాలంలో సూపర్ హిట్ గా నిలిచింది. కాగా, ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.111 కోట్ల గ్రాస్ ను, రూ.60.8 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం.
* ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ ‘పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్’పై ‘వాస్కోడగామా’ అనే టైటిల్ని రిజిస్టర్ చేశారు. ఈ టైటిల్ తన కుమారుడు ఆకాష్ హీరోగా రూపొందే చిత్రం కోసమని అంటున్నారు.
* వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్ 2’ చిత్రం షూటింగ్ కోసం యూనిట్ యూరప్ లోని చెక్ రిపబ్లిక్ కు చేరుకుంది. అక్కడ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లపై రెండు పాటలను చిత్రీకరిస్తారు.
Tags:వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్,geetha govindham,shruthi hassan,puri jaganadh touring talkies

Related posts

Leave a Comment