త్రివిక్రమ్ తో బన్నీ మూడో మూవీకి రంగం సిద్ధం

ఎన్టీఆర్ మూవీతో త్రివిక్రమ్ బిజీ
విక్రమ్ కుమార్ ప్రాజెక్టుతో బన్నీ
ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ తో సెట్స్ పైకి
లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా అన్ని అంశాలను కలుపుతూ త్రివిక్రమ్ తన సినిమాలకి కథలను తయారు చేసుకుంటూ ఉంటాడు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ కథను తెరపై ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలాంటి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో వుండనుందని తెలుస్తోంది.

గతంలో త్రివిక్రమ్ తో ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేసిన అల్లు అర్జున్, మళ్లీ ఆయనతో చేయడానికి కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆయనకి ఒక కథ చెప్పడం .. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత ..’ చేస్తోన్న త్రివిక్రమ్, ఆ తరువాత చేసేది అల్లు అర్జున్ తోనే అనేది ఖాయమైపోయింది. ఈలోగా విక్రమ్ కుమార్ తో సినిమాను పూర్తి చేసేసి అల్లు అర్జున్ రెడీగా ఉంటాడన్న మాట.

Related posts

Leave a Comment