తొలిరోజే అదరగొట్టేసింది ..

అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ ఎక్స్ 100’
యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ 
నిన్ననే ప్రేక్షకుల ముందుకు
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా రూపొందిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ అంటేనే స్పీడ్ గా ఉంటుంది .. అలాంటి యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా టీజర్ లోనే సినిమాలో ఎంత స్పీడ్ ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది.

దాంతో సహజంగానే ఈ సినిమా థియేటర్ల దగ్గర యూత్ ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో తొలిరోజున ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లిందట. 2.70 కోట్లకి అమ్ముడైన ఈ సినిమా, తొలిరోజునే 1.41 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం. వీకెండ్ లోనే ఈ సినిమా లాభాల బాట పడ్డటం ఖాయమని అంటున్నారు. పోస్టర్ విడుదల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా ఉండటంతో, యూత్ లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అదే ఈ స్థాయి వసూళ్లకు కారణమైందని చెప్పుకుంటున్నారు.

Related posts

Leave a Comment