తిరుమల వివాదం శ్రీవారి సృష్టే: తెలంగాణ సలహాదారు రమణాచారి కీలక వ్యాఖ్యలు

కొండపై ఏదో మార్పును కోరుకుంటున్న స్వామి
ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు
టీటీడీ మాజీ ఈఓ కేవీ రమణాచారి
తిరుమలలో నెలకొన్న వివాదం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సృష్టేనని, ఆయనే ఏ కారణం చేతనో ఈ వివాదాన్ని సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి కేవీ రమణాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల కొండపై ఏదో మార్పును స్వామివారు కోరుకుంటున్నారని, అందుకే ఈ వివాదం వచ్చిందని అభిప్రాయపడ్డ ఆయన, స్వామివారి ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు,. స్వామివారి ఆజ్ఞలేనిదే తిరుమల కొండపై ఏమీ జరగదని, ఈ విషయం తనకు చాలా బాగా తెలుసునని ఆయన చెప్పారు.

Related posts

Leave a Comment