తాడిపత్రి ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌.. ఆరుగురి మృతి

  • మరో ఇద్దరికి అస్వస్థత
  • ఆసుపత్రికి తరలింపు
  • అనంతపురం జిల్లా గెరుడౌ ఉక్కు కర్మాగారంలో కలకలం

అనంతపురం జిల్లా తాడిపత్రికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గెరుడౌ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకై ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించిన కర్మాగార సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై, మృతుల వివరాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Related posts

Leave a Comment