తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నట్లు లలిత్‌ ఊహలు
సంచలనం సృష్టించిన భాటియా కుటుంబ మరణం కేసును తవ్వేకొద్దీ మరిన్ని అనూహ్య కోణాలు వెలుగుచూస్తున్నాయి. మృతుల్లో ఒకరైన వృద్ధురాలు నారాయణ్‌ దేవి చిన్న కుమారుడు లలిత్‌ భాటియా(45) ఈ మరణాల వెనుక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. పదేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఆత్మతో మాట్లాడుతున్న భ్రమలో లలిత్‌ ఉండేవారని.. ఆత్మహత్య చేసుకునేలా కుటుంబ సభ్యులను ఆయనే పురిగొల్పారని అభిప్రాయపడుతున్నారు. మోక్ష ప్రాప్తికి సంబంధించి భాటియాల ఇంట్లో దొరికిన రిజిస్టర్లు, ఇతర కాగితాల్లో ఉన్నది లలిత్‌ చేతిరాతేనని వారు తేల్చారు. దిల్లీలోని బురారీ ప్రాంతంలోగల ఓ ఇంట్లో భాటియా కుటుంబ సభ్యులు 11 మంది ఆదివారం విగతజీవులుగా పడి ఉండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
భాటియాల ఇంట్లో దొరికిన రిజిస్టర్లల్లోని చేతిరాత లలిత్‌ చేతిరాతతో సరిపోలిందని పోలీసులు తెలిపారు. ఆస్తులు, వ్యాపారం, కుటుంబ బాధ్యతల విషయాల్లో తండ్రి ఆత్మ తనకు సూచనలు ఇస్తున్నట్లు లలిత్‌ అందులో రాసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఆయన రిజిస్టర్లు రాస్తున్నట్లు గుర్తించామన్నారు. చివరిసారిగా గత నెల 25వ తేదీని అందులో ప్రస్తావించారని చెప్పారు. ఉరి వేసుకోవడంలో అనుసరించాల్సిన పద్ధతిని స్పష్టంగా వివరించారని తెలిపారు. భాటియా కుటుంబ సభ్యులు తమ ఆత్మహత్యలు అనుకున్నరీతిలో పూర్తయ్యేలా.. కళ్లకు గంతలు కట్టుకోవడం, చేతుల్ని కట్టేసుకోవడం వంటి ప్రక్రియలను పలుమార్లు సాధన చేశారని స్పష్టమవుతున్నట్లు వెల్లడించారు. లలిత్‌ తన అనారోగ్యం గురించి తానే ప్రస్తావిస్తూ.. ‘లలిత్‌ ఆరోగ్యం గురించి బాధపడకండి. నా రాక వల్లే అతడికి సమస్యలొచ్చాయి’ అని రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూజ కోసం రోటీలు తెప్పించాలని.. వాటిని కుటుంబసభ్యులకు నారాయణ్‌ దేవి తినిపించాలని రిజిస్టర్లతో రాసి ఉందన్నారు. తదనుగుణంగా శనివారం రాత్రి బయటినుంచి వారు 20 రోటీలు తెప్పించుకున్నారని వెల్లడించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో మతిభ్రమకు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. సహాయం చేసే గుణమున్నప్పటికీ.. వారు ఎవర్నీ ఇంట్లోకి ఆహ్వానించేవారు కాదన్నారు. భాటియా కుటుంబ సభ్యులు 11 మంది 5కుర్చీల సాయంతో ఉరివేసుకున్నట్లు వెల్లడించారు.
భాటియాల ఇంట్లో ఎన్నెన్నో అనుమానాలు రేకెత్తించిన 11 పైపులకు వారి మరణంతో సంబంధం లేదని తేలింది. మృతుల సంఖ్య పైపుల సంఖ్యకు సమానంగా ఉండటం, వాటి అమరిక మృతదేహాల స్థితులకు సరిపోలడంతో తాము కూడా తొలుత గందరగోళానికి గురయ్యామని పోలీసులు తెలిపారు. అయితే, గాలి కోసం 3-4 నెలల క్రితం గోడకు వాటిని అమర్చినట్లు గుర్తించామన్నారు. ప్లైవుడ్‌లపై వినియోగించే రసాయనాల విషపూరిత ఉద్గారాలు బయటకు వెళ్లేందుకు అవి ఉపయోగపడేవని పేర్కొన్నారు.
భాటియా కుటుంబం మతాచారాలను బలంగా విశ్వసించేదని వారి దగ్గర చాన్నాళ్లుగా పనిచేస్తున్న అహ్మద్‌ అలీ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడేవారిలా వారి ప్రవర్తన ఎప్పుడూ కనిపించలేదన్నారు. ఆర్థికంగా ఉన్నవారైనా.. కారు, మోటారుసైకిల్‌ కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. తాను మోటారుసైకిల్‌ కొనుగోలు చేయనున్నట్లు తెలిసి.. తనను కూడా వారించారని చెప్పారు. వారు చాలా మంచివారని.. కిరాణా దుకాణంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించేవారు కాదని తెలిపారు. ప్రతిరోజు ఉదయం కుటుంబసభ్యులంతా ఇంట్లోని పెద్దవారి కాళ్లకు నమస్కరించేవారని.. రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేసేవారని వెల్లడించారు. చర్చిలు, మసీదులు, గురుద్వారాలకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించేవారని చెప్పారు.
భాటియాల మరణం వెనుక గాడా బాబా హస్తముండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తనను తాను తాంత్రికుడిగా చెప్పుకునే గాడా బాబా.. ‘మర్రిచెట్టు విన్యాసం’లో క్షుద్రపూజలు చేస్తాడని ప్రచారం. భాటియా కుటుంబం అదే తరహాలో ఉరివేసుకోవడంతో.. ఆత్మహత్య చేసుకునేలా అతడే వారిని పురిగొల్పి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాడా బాబా కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు.
Related posts
Leave a Comment