డౌట్ లేదు .. రామ్ దసరాకే వచ్చేస్తున్నాడు

రామ్ హీరోగా ‘హలో గురు ప్రేమకోసమే’
కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
అక్టోబర్ 18వ తేదీన భారీ రిలీజ్
కొంతకాలంగా రామ్ ను సక్సెస్ లు పలకరించడంలేదు. దాంతో ఈ సారి హిట్ కొట్టితీరాలనే పట్టుదలతో ఆయన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటిస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్రినాథరావు దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘సినిమా చూపిస్త మావా’ .. ‘ నేను లోకల్ ‘విజయాలను అందుకోవడం వలన, ఈ సినిమా సక్సెస్ పై రామ్ ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలు నెరవేరతాయేమో చూడాలి మరి.

Related posts

Leave a Comment