డీఎంకే అధినేత కరుణానిధి మృతి

  • చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ
  • కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు

డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి (94) మృతి చెందారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. కాగా, గత నెల 24వ తేదీన కరుణానిధిని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వయో భారం కారణంగా కరుణానిధి శరీర అవయవాలు చికిత్సకు స్పందించలేదు. కరుణ ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.

Related posts

Leave a Comment