టైటానిక్‌ పుట్టింది ఇక్కడే!

అనగనగా ఓ దేశం… అవడానికి చిన్నదే….అయినా వివరాలు వింతగాఅనిపిస్తాయి… ఇంతకీ ఆ దేశం కబుర్లేంటో తెలుసుకుందామా!

హాయిగా తిరగొచ్చు!
చెట్లుపుట్టల మధ్యలో తిరుగుతుంటే పెద్దవాళ్లు తిట్టేస్తారు… పాములుంటాయి అంటూ జాగ్రత్తలు చెప్పేస్తారు. కానీ ఐర్లాండ్‌లో ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు పాములే ఉండవు. కారణం ఏమిటంటే పాములు శీతల రక్త జీవులు (కోల్డ్‌బ్లడెడ్‌ యానిమల్స్‌). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్‌ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట.
* ఐర్లాండ్‌… ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో ఓ ద్వీపదేశం. చుట్టూ నీళ్లే సరిహద్దులు.
* ఇది పేరుకు ఒకే దేశం. కానీ ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌. రెండోది ఉత్తర ఐర్లాండ్‌. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌కు పూర్తి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఉత్తర ఐర్లాండ్‌ ఇంకా యూకేలో భాగమే.
* ఇక్కడి ప్రాంతాల పేర్లలో అతి పొడవైనది Muckanaghederdauhaulia.
* అమెరికా వైట్‌ హౌస్‌ డిజైనర్‌ జేమ్స్‌ హోబన్‌ ఈ దేశానికి చెందినవాడే.
* ఇక్కడ ఎక్కువ మంది సర్‌ నేమ్‌ ఓ(O),మ్యాక్‌(MAC)లతో మొదలవుతుంది. మ్యాక్‌ అంటే ‘సన్‌ ఆఫ్‌’ అని, ఓ అంటే ‘గ్రాండ్‌సన్‌ ఆఫ్‌’ అని అర్థమట.
* మన ముత్తాత్తాత్తాతలు ఐర్లాండ్‌కు చెందిన వారైతే ఇప్పుడు కూడా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు. ఎందుకంటే ఏ తరానికి చెందినవారైనా ఆ దేశస్థులైతే ఇప్పటికీ పౌరసత్వం వస్తుందట.
* ఈ దేశం ఎక్కువగా బంగాళదుంపల్ని ఎగుమతి చేస్తుంది.

Related posts

Leave a Comment