టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలనే బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది: వివరాలు చెప్పిన కేటీఆర్‌

కల్యాణలక్ష్మిని వివాహ మంగళ యోజనగా పేర్కొంది
టీఎస్ ఐపాస్ తరహాలో పరిశ్రమలకు అనుమతులు
టీ హబ్ పేరు మార్చి కే హబ్
రూ.5 భోజన పథకాన్ని సీఎం అన్నపూర్ణ క్యాంటిన్స్‌
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని తెలుపుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఇలా ఒకరు మనల్ని అనుకరించడమే అత్యుత్తమ ప్రశంస అని అన్నారు. మిషన్ కాకతీయను మిషన్ కల్యాణిగా బీజేపీ మేనిఫెస్టోలో ఉంచిందని, అలాగే, కల్యాణలక్ష్మి పథకాన్ని వివాహ మంగళ యోజనగా పేర్కొందని చెప్పారు. ఇక తెలంగాణలో అమలులో ఉన్న చేనేత రుణాలు రూ. లక్ష వరకు రుణమాఫీ, టీఎస్ ఐపాస్ తరహాలో పరిశ్రమలకు అనుమతులు, టీ హబ్ పేరు మార్చి కే హబ్, జీహెచ్‌ఎంసీ రూ.5 భోజన పథకాన్ని సీఎం అన్నపూర్ణ క్యాంటిన్స్‌గా బీజేపీ పెట్టుకుందని వివరించారు.

Related posts

Leave a Comment