‘జెర్సీ’లో నాయికగా శ్రుతి హాసన్

బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్స్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాని?
‘గీతాంజలి’ సీక్వెల్ లో నవీన్ చంద్ర
* నాని కథానాయకుడుగా క్రికెట్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. గౌతమ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తుందని సమాచారం. సెప్టెంబర్ నుంచి సెట్స్ కు వెళ్లే ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా నటిస్తాడు.
* బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో మరో భారీ యాక్షన్ మూవీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి షూటింగును ప్రారంభించి, అరవై రోజుల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
* ఇటీవల ‘మెహబూబా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ త్వరలో నానితో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నట్టు చెబుతున్నారు.
* అంజలి కథానాయికగా ‘గీతాంజలి 2’ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. సుబ్బు వేదుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర కీలక పాత్రను పోషిస్తాడు. వచ్చే నెలాఖరు నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రాన్ని ఏమ్వీవీ సత్యనారాయణతో కలసి కోన వెంకట్ నిర్మిస్తున్నాడు.

Related posts

Leave a Comment