జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు క్రియాశీల పాత్ర పోషించాలి: ప్రెస్ మీట్ లో కేసీఆర్‌

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉంది
ఇది మూడో, నాలుగో, ఐదో ఫ్రంటో కాదు
రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమావేశమైన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలపై చర్చించిన తరువాత వారిరువురూ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు క్రియాశీల పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు. 2019 ఎన్నికల కోసం పార్టీలను ఏకం చేయడం మాత్రమే కాకుండా, రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సి ఉందని అన్నారు. అఖిలేష్ యాదవ్‌తో నెల రోజులుగా చాలా సార్లు మాట్లాడానని, దేశంలో పరివర్తన రావాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. ఇది మూడో, నాలుగో, ఐదో ఫ్రంటో కాదని అన్నారు

Related posts

Leave a Comment