జయనగర్ బై పోల్స్… విజయాన్ని ఖాయం చేసుకున్న సౌమ్యా రెడ్డి!

ముగిసిన 8 రౌండ్ల కౌంటింగ్
10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సౌమ్యా రెడ్డి
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక జరిగిన బెంగళూరు పరిధిలోని జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి తన విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుండగా, 8వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన దివంగత బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ కన్నా 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. 8వ రౌండ్ తరువాత కాంగ్రెస్ అభ్యర్థినికి 31,642, బీజేపీఅభ్యర్థికి 21,437 ఓట్లు రాగా, నోటాకు 361 ఓట్లు వచ్చాయి. సౌమ్యా రెడ్డి గెలుపు ఖాయం కావడంతో, ఆమె అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు.

Related posts

Leave a Comment