జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఓటేసిన వైసీపీ!

జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నాం
ఖర్చు, అవినీతి తగ్గుతుంది
ప్రభుత్వం మధ్యలో కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు
వివరించిన విజయసాయిరెడ్డి
జమిలి ఎన్నికలపై దేశంలోని పార్టీల నుంచి లా కమిషన్‌ అభిప్రాయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ మినహా ప్రధాన పార్టీలన్నీ తమ నిర్ణయాన్ని తెలిపాయి. ఈరోజు ఏపీ ప్రతిపక్ష వైసీపీ కూడా తమ అభిప్రాయాన్ని తెలిపింది. జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తునట్లు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌కు లేఖ అందించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని అన్నారు. ఏ ప్రభుత్వమయినా మధ్యలో కూలిపోతే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహిస్తామని లా కమిషన్‌ తమతో చెప్పిందని తెలిపారు.

Related posts

Leave a Comment