జనసేన లక్ష్యాలను వెల్లడించిన పవన్ కల్యాణ్!

జనసేన లక్ష్యాలను వెల్లడించిన పవన్ కల్యాణ్!
  • ఈ నెల 14న జనసేన ఎన్నికల ముందస్తు ప్రణాళిక విడుదల
  • విద్యావ్యవస్థపై రూపొందించిన ముసాయిదాపై చర్చ
  • నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమన్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం పార్టీ లక్ష్యాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో పవన్ అధ్యక్షతన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ నెల 14న ఎన్నికల ముందస్తు ప్రణాళికను జనసేన విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థపై పార్టీ విధానాల కమిటీ రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. పవన్ మాట్లాడుతూ.. ఫిన్లాండ్‌లో విజయవంతమైన విద్యావిధానాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో వాటిని ఏ మేరకు అమలు చేయవచ్చో అధ్యయనం చేయాలని సూచించారు.

నాణ్యమైన విద్యను అందించడమే జనసేన లక్ష్యమన్న ఆయన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఇతర వర్గాల వసతి గృహాలు, పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జనసేన లక్ష్యాల్లో ఒకటన్నారు. వసతిగృహాల గదుల్లోకి వెలుతురు, గాలి వచ్చేలా చూడడం, పౌష్టికాహారాన్ని అందించడం, విద్యార్థులకు రక్షణ కల్పించడం వంటి వాటిని ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని సూచించారు. అరకు, పాడేరులోని వసతి గృహాలను సందర్శించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నారు.

Related posts

Leave a Comment