జగన్ పాదయాత్రకు నిరసనల సెగ.. అడ్డుకున్న కాపులు!

కాపు రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
నల్ల జెండాలు, ప్లకార్డులతో నిరసన
స్పందించని వైఎస్సార్ సీపీ అధినేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో నిరసనల సెగ తగిలింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో కాపు యువకులు ఈ రోజు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘జై కాపు.. జైజై కాపు’ అంటూ నినాదాలు చేశారు.

కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించకుండానే జగన్ అక్కడ్నుంచి ముందుకు కదిలారు.

Related posts

Leave a Comment