జగనన్నకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు: రోజా

నేటితో 3 వేల కి.మీ. దాటనున్న జగన్ పాదయాత్ర
269 రోజుల్లో 116 నియోజకవర్గాలను కవర్ చేసిన జగన్
మిగిలినది మరో రెండు జిల్లాలే
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో, ఆ పార్టీ మహిళా నేత ఆర్కే రోజా, తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. “269 రోజులుగా 116 నియోజకవర్గాల్లోని 1650 గ్రామాలు, 7 కార్పొరేషన్లు, 44 మున్సిపాలిటీలలో పాదయాత్ర చేస్తూ నేడు 3 వేల కిలోమీటర్లకు చేరుకోనున్న జగనన్నకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ” అని ఆమె ట్వీట్ చేశారు.

ఓ చిన్న వీడియోను కూడా ఆమె పోస్టు చేశారు. కాగా, జగన్ పాదయాత్ర ఏపీలోని 11 జిల్లాల్లో పూర్తికాగా, ఈ ఉదయం విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఆపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం వరకూ సాగి ముగియనుంది.

Related posts

Leave a Comment