చెలామణిలోకి వచ్చిన కొత్త రూ. 100 నోట్లు… చూసిన ప్రజల ఆనందం!

  • బ్యాంకుల నుంచి అందుకుంటున్న కస్టమర్లు
  • అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త కరెన్సీ
  • పాత కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుందన్న ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 1న కొత్త 100 రూపాయల కరెన్సీని చెలామణిలోకి తేగా, బ్యాంకుల నుంచి పలువురు వాటిని అందుకుని చూసి బాగున్నాయంటూ ఆనందంతో మురిసిపోయారు. ముందుబాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుకవైపు ‘రాణికీ వాస్’ ముద్రించి వున్న ఈ నోటు లావెండర్ రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో తదితరాలు కూడా ఈ నోటుపై ముద్రించివున్నాయి. ఈ నోట్లతో పాటు ప్రస్తుతం చెలామణిలో ఉన్న పాత రూ. 100 కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ పేర్కొంది.
Tags:new ,100,rupees,currency,note, features in 100 note

Related posts

Leave a Comment