చిరంజీవి ఇంటికి భార్యాపిల్లలతో కలసి వెళ్లిన పవన్ కల్యాణ్..

అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా చిరంజీవి ఇంటికి జనసేన అధినేత, చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. భార్య లెజెనోవా, పిల్లలతో కలసి జనసేనాని అన్నయ్య ఇంటికి వెళ్లారు. అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలసి భోజనం చేయనున్నారు. పవన్ రాకతో చిరు ఇల్లు మరింత సందడిగా మారింది. అన్నదమ్ములిద్దరూ ఒకే చోట చేరడంతో, మెగా అభిమానుల ఆనందం రెట్టింపయింది.

Related posts

Leave a Comment