చిన్ని కృష్ణుడిగా దేవాన్ష్… ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
తెలుగు ప్రజలకు లోకేశ్ శుభాకాంక్షలు
దేవాన్ష్ ను కృష్ణుడిగా అలంకరించి ముచ్చట
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “గిరిని సైతం గోటితో లేపినా, తులసీ దళానికే తేలిపోయాడట! ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ, తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!” అని చెబుతూ, తన కుమారుడు దేవాన్ష్ ను కృష్ణుడిగా అలంకరించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. లోకేశ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts

Leave a Comment