చిత్తూరు జిల్లాలో నలుగురి సజీవ దహనం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం కావడం కలకలంరేపింది. మృతుల్లో భార్యాభర్తతో పాటూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పలమనేరుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం భార్య, కొడుకు, కూతురుతో కలిసి రాజుల కండ్రిగకు వచ్చి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో నలుగురు ఒకే మంచంపై నిద్రించారు. టాప్ వ్యాఖ్య Most horrifying. Sainath Kalpathy 0 | 0 | 0 గొప్పా |జవాబు అన్ని వ్యాఖ్యలు మీ కామెంట్ రాయండి ఆదివారం ఉదయం శ్రీనివాస్ రెడ్డితో సహా భార్య, ఇద్దరు పిల్లలు సజీవదహనమై విగతజీవులుగా కనిపించారు. ప్రమాదం గురించి తెలియగానే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై ఆరా తీశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరించారు. గ్యాస్ లీకేజీ వలన ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అలాగే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో అక్కడే పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఘటన కారణమేంటన్నది మిస్టరీగా మారింది. అయితే శ్రీనివాస రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని బంధువులు చెబుతున్నారు. ఒకే ఘటనలో కుటుంబం మొత్తం చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం కావడం కలకలంరేపింది. మృతుల్లో భార్యాభర్తతో పాటూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పలమనేరుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం భార్య, కొడుకు, కూతురుతో కలిసి రాజుల కండ్రిగకు వచ్చి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో నలుగురు ఒకే మంచంపై నిద్రించారు.

ఆదివారం ఉదయం శ్రీనివాస్ రెడ్డితో సహా భార్య, ఇద్దరు పిల్లలు సజీవదహనమై విగతజీవులుగా కనిపించారు. ప్రమాదం గురించి తెలియగానే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై ఆరా తీశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలను సేకరించారు. గ్యాస్ లీకేజీ వలన ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అలాగే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో అక్కడే పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.

ఘటన కారణమేంటన్నది మిస్టరీగా మారింది. అయితే శ్రీనివాస రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని బంధువులు చెబుతున్నారు. ఒకే ఘటనలో కుటుంబం మొత్తం చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts

Leave a Comment