చానాళ్ల తరువాత… నేడు ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్!

నేడు గుంటూరు సమీపంలో దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
లింగమనేని టౌన్ షిప్ లో కార్యక్రమం
హాజరుకానున్న పలువురు ప్రముఖులు
చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవనున్నారు. నేడు గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరుకానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే ఈ నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తి అయిన సంగతి తెలిసిందే. దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా, గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే కానుంది.

అమరావతిలో నేడు ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్‌కు చంద్రబాబు శంకుస్థాపన
ఉదయం 10 గంటలకు భూమి పూజ
అంచనా వ్యయం రూ.400 కోట్లు
36 అంతస్తులతో రాజధానికే తలమానికం
ప్రవాసాంధ్రుల కోసం ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్‌కు మరికొన్ని గంటల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ నిర్వహించనున్నారు. రాజధానిలోని పరిపాలన నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తుల్లో ఏపీఎన్ఆర్‌టీ దీనిని నిర్మించనుంది.

అమరావతి ఇంగ్లిష్ అక్షరాల్లోని ‘ఎ’ తరహాలో ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్ ఆకృతిని రూపొందించారు. కొరియాకు చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ ఆకృతిని రూపొందించింది. భవనం అంతస్తుల మధ్య పిల్లర్లు లేకుండా నిర్మిస్తుండడంతో మామాలు కంటే స్థలం కలిసొస్తుందని అధికారులు తెలిపారు.

అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ టవర్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన అనంతరం తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు.

Related posts

Leave a Comment