చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు

పార్టీ కండువా కప్పిన చంద్రబాబు
గతంలో వైసీపీ, బీజేపీలో పనిచేసిన రఘురామ కృష్ణంరాజు
వచ్చే ఎన్నికల్లో ప.గో.లో 15 సీట్లు సాధిస్తామన్న టీడీపీ నేతలు
ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామ కృష్ణంరాజు… ఆ తరువాత బీజేపీలో చేరారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆయన ఇటీవలే టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలో ఈ రోజు విజయవాడకు వచ్చిన ఆయనకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ సీతారామలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు సాధిస్తామని పార్టీ నేతలు అన్నారు.

Related posts

Leave a Comment