చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడిన మోత్కుపల్లి..

ఆయన పాపాలకు దేవుడే శిక్ష విధిస్తాడన్న బహిష్కృత నేత
చంద్రబాబు నన్ను అవహేళన చేశారు
చేసిన పాపాలకు దేవుడు శిక్ష విధిస్తాడు
ఏ పార్టీలోనూ చేరబోవడం లేదు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణకు చెందిన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పాదయాత్రగా బయలుదేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు.

చంద్రబాబు తనను ప్రజల ముందు అవహేళన చేశారని, ఆయన చేసిన పాపాలకు ఆ దేవుడే శిక్ష విధిస్తాడని అన్నారు. తాను సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఏ పార్టీలో చేరబోతున్నారన్న మీడియా ప్రశ్నకు మోత్కుపల్లి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని తేల్చి చెప్పారు.

Related posts

Leave a Comment