గోదారమ్మకు వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు!

  • పశ్చిమ గోదావరిలో ముగిసిన జగన్ పర్యటన
  • నేటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి
  • గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక పూజలు

తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా, ఈ ఉదయం పశ్చిమ గోదావరిలో పర్యటనను ముగించుకుని, తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టేందుకు బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, కొవ్వూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకొన్నారు. అక్కడ గోదారమ్మ తల్లికి జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ కు సంప్రదాయ స్వాగతం పలికిన షోష్పాద క్షేత్రం వేద పండితులు, వేద మంత్రాలు చదువుతుండగా, నదీమతల్లికి జగన్ హారతినిచ్చారు. ఆపై ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. జగన్ తో పాటు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Related posts

Leave a Comment