‘గీత గోవిందం’ బన్నీ చేయవలసిందట!

గీతా ఆర్ట్స్ 2 లో ‘గీత గోవిందం’
హీరోయిన్ ఎంపిక విషయంలో జాప్యం
ఆగస్టు 15వ తేదీన విడుదల
పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీత గోవిందం’ .. వచ్చేనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. ముందుగా ఈ కథను అల్లు అర్జున్ కి వినిపించినట్టుగా చెప్పాడు.

అల్లు అర్జున్ కి ఈ కథ ఎంతగానో నచ్చిందనీ, అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా చేయలేక పోయాడని అన్నాడు. ఇక ఈ కథకి ఫలానా కథానాయికలైతే బాగుంటుందని భావించిన అల్లు అర్జున్ .. అవకాశం వస్తే ఈ ప్రాజెక్టును వదులుకోవద్దని వాళ్లకి చెప్పాడట. అయినా ఆ కథానాయికలెవరూ ఈ సినిమా చేయడానికి ఆసక్తిని చూపించలేదని అన్నాడు. హీరోయిన్ ఎంపిక విషయంలో మూడు నెలలు వెయిట్ చేయవలసి వచ్చిందని చెప్పాడు. దాంతో ఈ కథ ఏ హీరోయిన్స్ దగ్గరికి వెళ్లింది? వాళ్లు ఎందుకని ఉత్సాహాన్ని చూపించలేదనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

Related posts

Leave a Comment