ఖగోళ అద్భుతం.. ఎక్కడెక్కడ వీక్షించవచ్చంటే!

దిల్లీ : ఈ శతాబ్దపు సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నెల 27న ఏర్పడనున్న విషయం తెలిసిందే. దాదాపు గంట 45 నిమిషాల పాటు సాగే ఈ చంద్రగ్రహణం చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే రోజు అరుణవర్ణ చంద్రుడు కూడా కనువిందు చేయనున్నాడు. ఉత్తర అమెరికా, అర్కిటిక్‌, పసిఫిక్‌ ప్రాంతాలు మినహా ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించవచ్చు.

ఆయా దేశాల కాలమానాల ప్రకారం ఈ చంద్రగ్రహణం ఆయా సమయాల్లో కనిపించనుంది. కైరో(ఉత్తర ఆఫ్రికా)లో ఇది రాత్రి 9.30గంటలకే కనిపించనుండగా.. మాస్కో(తూర్పు యూరప్‌)లో రాత్రి 10.30గంటలకు, దిల్లీ(దక్షిణాసియా)లో రాత్రి 10.44 గంటలకు కనువిందు చేయనుంది. చాలా తూర్పు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.

ఉత్తమ వీక్షణ స్థానాలు

ఈజీప్ట్‌లోని కైరో, సాంటోరినిలోని గ్రీస్‌, బింబాబ్వేలోని హరారే

సంపూర్ణ గ్రహణం కన్పించే దేశాలు

భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, మధ్య ఆఫ్రికాలోని పలు దేశాలు

పాక్షికంగా కనిపించే ప్రదేశాలు

దక్షిణ అమెరికా, న్యూజిలాండ్‌, ఇరాన్‌, సూడాన్‌, మడగాస్కర్‌, ఇరాక్‌, టర్కీ, కజకిస్థాన్‌, ఉక్రెయిన్‌

పూర్తిగా కనిపించని ప్రదేశాలు

ఉత్తర అమెరికా, అర్కిటిక్‌, పసిఫిక్‌ ప్రాంతం

భారత్‌లో చంద్రగ్రహణ సమయం..

చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10.44 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే సంపూర్ణ గ్రహణాన్ని మాత్రం అర్ధరాత్రి 1 గంట సమయంలో వీక్షించవచ్చు. బ్లడ్‌ మూన్‌ను దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా వీక్షించవచ్చు.

Related posts

Leave a Comment