కొద్దిలో తొలి స్థానం మిస్ అయిందన్న కేటీఆర్…

తెలుగు రాష్ట్రాల మధ్య ‘వన్, టూ’ లేదన్న లోకేష్!
సులువుగా వ్యాపారం చేసుకునే రాష్ట్రాల్లో టాప్-2లో తెలుగు రాష్ట్రాలు
కొద్దిలో ఫస్ట్ ప్లేస్ మిస్ అయిందన్న కేటీఆర్
రెండూ తెలుగు రాష్ట్రాలేనని వ్యాఖ్యానించిన లోకేష్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులువుగా వ్యాపారం చేసుకునే వీలు) ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలువగా, రెండు రాష్ట్రాల్లో ఐటీ మంత్రులుగా ఉన్న యువనేతలు లోకేష్, కేటీఆర్ ల మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నిన్న ర్యాంకులు ప్రకటించిన తరువాత కేవలం 0.09 శాతం తేడాతో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానాన్ని కోల్పోయిందని కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కు అభినందనలు కూడా చెప్పారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ, తెలుగు రాష్ట్రాల మధ్య వన్, టూ ఉండవని అనడం గమనార్హం. “మీకు కూడా అభినందనలు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయన్నదే విషయం. ఇక్కడ ‘వన్ అండ్ టూ’లు లేవు. అంతా తెలుగు ప్రజల మంచికే” అని ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లూ వైరల్ అవుతున్నాయి.

Related posts

Leave a Comment