కేర‌ళ‌ను ఇప్పుడు మొస‌ళ్లు, పాములు వణికిస్తున్నాయి..!

మొన్న‌టిదాక దాదాపు 10రోజులు ఏక‌తాటిగా కురిసిన భారీ వ‌ర్షానికి కేర‌ళ మొత్తం అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే… రాష్ట్రంలోని 14జిల్లాలు నీట‌మునిగి, రోడ్ల‌న్ని జ‌ల‌మ‌య‌మై రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా బ్ర‌తుకుజీవుడా అంటూ పున‌రావాస కేంద్రాల్లో త‌ల‌దాచుకున్నారు క‌దా… గ‌త మూడు రోజుల నుంచి వ‌ర్షం కుర‌వ‌క‌పోవ‌డంతో వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో పున‌రావాస కేంద్రాల్లో త‌ల‌దాచుకున్న ప్ర‌జ‌లంతా తిరిగి వారి నివాసంలోకి వ‌స్తున్నారు.. ఇంకా కొన్ని జిల్లాలోని గ్రామాలు మాత్రం నీటిలోనే చిక్కుకున్నాయి. ఇక్క‌డి ప్ర‌జ‌లంతా పున‌రావాస కేంద్రాల్లోనే ఉన్నారు

అయితే పున‌రావ‌స కేంద్రాల నుంచి తిరిగి ఇళ్ల‌కు వ‌స్తున్న వారికి మ‌రో భ‌యం పుట్టుకుంది. మొన్న‌టివ‌ర‌కు వ‌ర్షం వ‌ణికిస్తే ఇప్పుడు మొస‌ళ్లు, పాములు వారిని వ‌ణికిస్తున్నాయి. పునరావాసాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నవారికి ఇళ్లలో పాములు స్వాగతం పలుకుతున్నాయి. కేరళలో వరద తగ్గినా ఇక్కట్లు మాత్రం తప్పడంలేదు. అలాగే వారు బురదలో కూరుకుపోయిన సొంతిళ్లను చూసుకోలేకపోతున్నారు. దానికి తోడు ఇళ్లల్లోకి పాములు, మొసళ్లు రావడంతో భయంతో వణికిపోతున్నారు. అడవుల్లోని జంతువులు, సర్పాలు అన్నీ గ్రామాల్లోకి రావడంతో వాటిని చూసి షాక్‌కు గుర‌వుతున్నారు.

కొంద‌రి ఇళ్లలో వరద నీరు పోయినా బురద పేరుకుపోయి, వస్తువులు, ఫర్నీచర్‌ ధ్వంసమై దారుణంగా ఉన్నాయి. కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూరు‌, పథనంథిట్ట, అలెప్పీ, కొల్లాం జిల్లాలో వరద ప్రభావం అధికంగా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. కాగా వరద నీరు తగ్గిన చోట ప్రజలు ఇళ్లకు వెళ్లి చూస్తే బురదతోపాటు కొందరి ఇళ్లలో పాములు, ఇతర జలచరాలు, పురుగులు, కీటకాలు కనిపిస్తున్నాయి.

ఇళ్ల‌లో ఎటు చూసినా పాములు, మొస‌ళ్లు, ఇత‌ర విష పురుగులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఓ ఇంట్లో అయితే వాష్‌బేషిన్‌లో పాము, క‌ప్ బోర్టులో చుట్టుకున్న పాముల‌ను చూడ‌టంతో వారంతా భ‌య‌కంపితుల‌వుతున్నారు.
అడవుల్లో నుంచి వ‌ర‌ద కొట్టుకురావ‌డంతో ఆ వ‌ర‌ద వెంట ఇవ్వ‌న్ని వ‌చ్చి వారిని భయపెడుతున్నాయి. ఇక ఇక్క‌డ‌ పాము కాట్ల కేసులూ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆగస్టు 15 నుంచి 20 మధ్య ఐదు రోజుల్లోనే 53 కేసులు నమోదయ్యాయి. ఇక, త్రిశూర్‌ జిల్లాలోని చాలకుడిలో ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో మొసలిని చూసి నివ్వెరపోయాడు. ఇరుగు పొరుగు వారి స‌హాయంతో దానిని పట్టుకున్నారు. ఇలా కేర‌ళ‌లోని ఏ జిల్లా, మండ‌ల, గ్రామాల్లో చూసినా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ విష పురుగుల‌తో పాటు మ‌ళ‌యాలీల‌ను మ‌రో భ‌యం వెంటాడుతుంది. అంటురోగాలు వ‌స్తాయ‌ని వ‌ణికిపోతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌లేదు. ఇంకా ముంపులోనే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్క‌డి ప్ర‌జ‌లంతా త‌మ‌ను ర‌క్షించాలంటూ వేడుకుంటున్నారు. అంతేకాకుండా అక్క‌డి ఇడుక్కి డ్యామ్ నుండి భారీ ఎత్తున నీరు కింద‌కు రావ‌డంతో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు దిక్కులేక పున‌రావాస కేంద్రాల్లోనే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే వ‌ర్షాలు త‌గ్గ‌డంతో త‌మ సొంత ఇళ్ల‌లోకి వెళ్లే వారికి వీటిని చూసి ఇంకా మా క‌ష్టాలు తీర‌లేదా అని వారు బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు.

Related posts

Leave a Comment