కేటీఆర్‌.. మీరు ఆనందంగా ఉండాలి: లోకేష్

42వ పుట్టిన రోజు జరుపుకొంటున్న కేటీఆర్‌
అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
తనదైన శైలిలో థ్యాంక్స్‌ చెప్పిన కేటీఆర్‌
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామ రావు 42వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌కు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజు ప్రతీక్షణం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటున్నట్లు లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సినీనటులు, రాజకీయ నాయకులు ట్విట్టర్‌లో విషెస్‌ తెలుపగా వారికీ కేటీఆర్‌ తనదైన శైలిలో థ్యాంక్స్‌ చెప్పారు. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు అభిమానులు మొక్కలు నాటగా, మరికొంత మంది పండ్లు పంపిణీ చేశారు.

Related posts

Leave a Comment