కుప్పకూలిన గౌలిగూడ బస్టాండు కొద్ది రోజులుగా శబ్దాలు అప్రమత్తమై ఖాళీ చేయించిన ఆర్టీసీ అధికారులు దశాబ్దాలుగా ప్రయాణికుల అవసరాలు తీర్చిన గౌలిగూడలోని పాత బస్టాండు గురువారం కుప్పకూలింది. ఇనుప స్తంభాలు, రేకులతో భారీస్థాయిలో నిర్మించిన నిజాం కాలంనాటి ఈ చారిత్రక కట్టడం బస్సు ప్రాంగణంలోనే పెద్ద శబ్దంతో నేలకొరిగింది. నిత్యం వేలమంది ప్రయాణికుల రద్దీతో, క్షణం ఖాళీ లేకుండా తిరిగే బస్సులతో కిటకిటలాడే పాత సీబీఎస్‌ కుప్పకూలినా..టీఎస్‌ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నాలుగైదు రోజులుగా శబ్దాలు వినిపిస్తుండటంతో ఆర్టీసీ అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం కూడా ఆ మార్గంలో వెళ్తున్న వారికి శబ్దాలు వినిపించాయి. గ్రేటర్‌హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ పురుషోత్తం, హైదరాబాద్‌ నగర ఆర్‌ఎం వినోద్‌కుమార్‌, కాచిగూడ డిపో మేనేజర్‌ చందర్‌రావు ఆర్టీసీ ఇంజినీర్లతో కలిసి చర్చించి బస్సుల రాకపోకలను రద్దు చేశారు. టీఎస్‌ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌ శర్మ గురువారం ఉదయం 9.30 గంటలకు సందర్శించాల్సి ఉండగా.. ఉదయం 7.30 గంటలకే కుప్పకూలింది. ధన, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఆర్టీసీ అధికారుల ముందస్తు జాగ్రత్తలను పలువురు కొనియాడారు. గత శుక్రవారం ఉదయం బస్సు పాస్‌ కౌంటర్ల వద్ద ప్రధాన ఇనుప స్తంభం కాస్త ఒంగి ఇనుప రేకులు పైకి లేవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు సాయంత్రానికి సీబీఎస్‌ హ్యాంగర్‌ను ఖాళీ చేశారు. బస్సులు, ప్రయాణికులు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. 14 దుకాణాలనూ ఖాళీ చేయించారు. పాసుల జారీ కేంద్రాన్ని తొలగించి బయటున్న ఆర్టీసీ కార్మికుల విశ్రాంతి గదుల సమీపంలో ఏర్పాటు చేశారు. బస్సుల రాకపోకల్ని సీబీఎస్‌ ముందున్న రోడ్డుపై నుంచి మళ్లించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా: మహేందర్‌రెడ్డి గౌలిగూడ సీబీఎస్‌ కూలిపోయిన ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సూచనల మేరకు అభివృద్ధి చేస్తామని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి సీబీఎస్‌ను సందర్శించి మాట్లాడారు. ఈ స్థలాన్ని ఇతర సంస్థలకుగానీ, ప్రైవేటు వ్యక్తులకుగానీ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సీబీఎస్‌పై ఆధారపడి ఉపాధి పొందుతున్న స్టాళ్ల నిర్వాహకులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఆయన వెంట తెరాస నాయకులు ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, స్టాళ్ల సంఘం అధ్యక్షులు నరేందర్‌ యాదవ్‌, కార్యనిర్వాహక సంచాలకులు పురుషోత్తంనాయక్‌, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

కుప్పకూలిన గౌలిగూడ బస్టాండు కొద్ది రోజులుగా శబ్దాలు అప్రమత్తమై ఖాళీ చేయించిన ఆర్టీసీ అధికారులు
దశాబ్దాలుగా ప్రయాణికుల అవసరాలు తీర్చిన గౌలిగూడలోని పాత బస్టాండు గురువారం కుప్పకూలింది. ఇనుప స్తంభాలు, రేకులతో భారీస్థాయిలో నిర్మించిన నిజాం కాలంనాటి ఈ చారిత్రక కట్టడం బస్సు ప్రాంగణంలోనే పెద్ద శబ్దంతో నేలకొరిగింది. నిత్యం వేలమంది ప్రయాణికుల రద్దీతో, క్షణం ఖాళీ లేకుండా తిరిగే బస్సులతో కిటకిటలాడే పాత సీబీఎస్‌ కుప్పకూలినా..టీఎస్‌ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నాలుగైదు రోజులుగా శబ్దాలు వినిపిస్తుండటంతో ఆర్టీసీ అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం కూడా ఆ మార్గంలో వెళ్తున్న వారికి శబ్దాలు వినిపించాయి.

గ్రేటర్‌హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ పురుషోత్తం, హైదరాబాద్‌ నగర ఆర్‌ఎం వినోద్‌కుమార్‌, కాచిగూడ డిపో మేనేజర్‌ చందర్‌రావు ఆర్టీసీ ఇంజినీర్లతో కలిసి చర్చించి బస్సుల రాకపోకలను రద్దు చేశారు. టీఎస్‌ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌ శర్మ గురువారం ఉదయం 9.30 గంటలకు సందర్శించాల్సి ఉండగా.. ఉదయం 7.30 గంటలకే కుప్పకూలింది. ధన, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఆర్టీసీ అధికారుల ముందస్తు జాగ్రత్తలను పలువురు కొనియాడారు. గత శుక్రవారం ఉదయం బస్సు పాస్‌ కౌంటర్ల వద్ద ప్రధాన ఇనుప స్తంభం కాస్త ఒంగి ఇనుప రేకులు పైకి లేవడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు సాయంత్రానికి సీబీఎస్‌ హ్యాంగర్‌ను ఖాళీ చేశారు. బస్సులు, ప్రయాణికులు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. 14 దుకాణాలనూ ఖాళీ చేయించారు. పాసుల జారీ కేంద్రాన్ని తొలగించి బయటున్న ఆర్టీసీ కార్మికుల విశ్రాంతి గదుల సమీపంలో ఏర్పాటు చేశారు. బస్సుల రాకపోకల్ని సీబీఎస్‌ ముందున్న రోడ్డుపై నుంచి మళ్లించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా: మహేందర్‌రెడ్డి
గౌలిగూడ సీబీఎస్‌ కూలిపోయిన ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సూచనల మేరకు అభివృద్ధి చేస్తామని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి సీబీఎస్‌ను సందర్శించి మాట్లాడారు. ఈ స్థలాన్ని ఇతర సంస్థలకుగానీ, ప్రైవేటు వ్యక్తులకుగానీ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సీబీఎస్‌పై ఆధారపడి ఉపాధి పొందుతున్న స్టాళ్ల నిర్వాహకులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఆయన వెంట తెరాస నాయకులు ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, స్టాళ్ల సంఘం అధ్యక్షులు నరేందర్‌ యాదవ్‌, కార్యనిర్వాహక సంచాలకులు పురుషోత్తంనాయక్‌, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

Related posts

Leave a Comment