కల్యాణ్ దేవ్ ను అభినందించిన చిరంజీవి

కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’
కథానాయికగా మాళవిక నాయర్
కీలకపాత్రలో మురళీశర్మ
కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందిన ‘విజేత’ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రసాద్ ల్యాబ్ లో చిరంజీవి కోసం స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్ .. కల్యాణ్ దేవ్ .. నిర్మాత సాయికొర్రపాటి .. మురళీ శర్మతో పాటు ఇతర యూనిట్ సభ్యులు ఈ స్పెషల్ షోను వీక్షించారు.

ఈ సినిమా చూసిన చిరంజీవి .. ఒక మంచి సినిమా తీశారంటూ నిర్మాత సాయికొర్రపాటిని ప్రశంసించారట. దర్శకుడిగా చక్కని ప్రతిభాపాటవాలు కనబరిచారంటూ దర్శకుడు రాకేశ్ శశిని మెచ్చుకున్నారు. తొలి సినిమానే అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా .. బెరుకు లేకుండా బాగా చేశావంటూ కల్యాణ్ దేవ్ భుజం తట్టినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ సరసన కథానాయికగా మాళవిక నాయర్ నటించిన సంగతి తెలిసిందే.

Related posts

Leave a Comment