కలిసొచ్చిన కార్తీక పంచమి, సోమవారం!

పరమ శివుడికి అత్యంత పవిత్రమైన కార్తీకమాసంలో నేడు కార్తీక పంచమితో పాటు సోమవారం కూడా కలిసి రావడంతో శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీతీరాలు, సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ద్రాక్షారామం, సామర్లకోట, కోటిపల్లి, పిఠాపురం, మురమళ్ల, ముక్తేశ్వరం, పాలకొల్లు క్షీరారామం, భీమవరం సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, ఇంద్రకీలాద్రిలో స్వామి దర్శనానికి గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి. నేడు అయ్యప్ప మాలలు ధరించేందుకు కూడా పెద్దఎత్తున పురుషులు, యువకులు ఆసక్తి చూపించడంతో అయ్యప్ప ఆలయాలూ కిటకిటలాడుతున్నాయి.

Related posts

Leave a Comment