కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

ఆరుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ ఆటోను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాలీ ఆటోలో 21 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కర్నూలుకు చెందినవారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు.

Related posts

Leave a Comment