కత్తి మహేష్ ని జీవితకాలం నిషేధించండి: ఎమ్మెల్యే రాజాసింగ్

కత్తి మహేష్ కు ఆరు నెలల నిషేధం సరిపోదు
పరిపూర్ణానందను పోలీసులు కలవనీయలేదు
పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై ఆరు నెలల నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, కత్తి మహేష్ కు ఆరు నెలల నిషేధం సరిపోదని… హైదరాబాదు నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు తమను పోలీసులు అనుమతించలేదని… దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మరోవైపు ప్రభుత్వ తీరును బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు. ధర్మాగ్రహ యాత్ర చేస్తానన్న పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారని… రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Related posts

Leave a Comment