కత్తిలాంటి ప్రశ్నేసిన డైరక్టర్ వివేక్.. లేచి వెళ్ళిపోయిన మహేష్.. తల్లి గురించి? (video)

mahesh kathi leaves from live show not able to answer director vivek question

mahesh kathi leaves from live show not able to answer director vivek question

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు, ఫ్యాన్స్‌పై చురకలు అంటిస్తూ ప్రతి నిత్యం వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు డైరక్టర్ వివేక్ చుక్కలు చూపించారు. ఓ టీవీ లైవ్ షోలో కత్తిని నోరెత్తనీయని ప్రశ్నతో కట్టడి చేశాడు. అంతేగాకుండా ఆ షో నుంచి పారిపోయేలా ప్రశ్న వేశాడు.

అంతే చేసేది లేక నోరెత్తక కత్తి లైవ్ షో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే? కత్తి మహేష్- డైరక్టర్ వివేక్‌ల మధ్య జరిగిన లైవ్ షోలో.. పవన్ తరపున వివేక్ ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఐదు నిమిషాల పాటు మౌనం పాటించి కత్తి షో నుంచి వెళ్లిపోయాడు.

ఆ ప్రశ్న ఏమిటంటే? మీరు పవన్ గురించి మాట్లాడారు. ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడారు. పవన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. అంతటితో ఆగకుండా క్షుద్రపూజలు అంటగట్టారు. బూతులు తిట్టారు. పవన్‌కు అక్రమ సంబంధాలు ఆపాదించారు. గోత్రాలతో సహా అన్నీ మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు. అయితే మీ గురించి.. మీ తల్లి గురించి తెలుసుకోవాలనుంది. మీ తల్లి గురించి ఓ రెండు నిమిషాలు మాట్లాడగలరా? అంటూ అడిగారు వివేక్. ఈ ప్రశ్నకు కత్తి తన తల్లి గురించి చెప్పనని స్పష్టం చేశాడు.

ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నకు కత్తి మహేష్ బదులివ్వలేదు. తల్లి గురించి చెప్పేందుకు అంతగా వెనుకాడాల్సిన అవసరం ఏముందని వివేక్ ప్రశ్నించాడు. తల్లి గురించి చెప్పడమే కష్టమైందా? అసలు ఆమె గురించి చెప్పేందుకు జంకు ఎందుకు? అని అడిగారు. దేశంలో వున్న అందరి గురించి మాట్లాడుతున్న కత్తి గురించి.. అందరూ తెలుసుకోవాలనే ఆ ప్రశ్న వేశానని వివేక్ చెప్పుకొచ్చారు.

తల్లి గురించి దాయాల్సిన అవసరం ఏముందన్నారు. కత్తి తల్లి గురించి దాస్తే దాని వెనుక పెద్ద భయంకరమైన, దరిద్రమైన కథ వుందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. దేశంలో ఓ పౌరుడిగా తనకు కత్తి మహేష్ తల్లి గురించి తెలుసుకోవాలనుందని.. ఆ విషయాన్ని చెప్పాలని వివేక్ అడిగారు.

మీ అమ్మగారు గొప్పవారన్నదే తన అభిప్రాయమని.. ఆమె గురించి చెప్తే వినాల్సి వుందని వివేక్ అడిగారు. మీరు అందరినీ ప్రశ్నించవచ్చు. మీరు అందరి గురించి చెప్పొచ్చు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ అడగకూడదా? అంటూ వివేక్ అడగారు. కానీ కత్తి మహేష్ మాత్రం నోరు విప్పకుండా లైవ్ షో నుంచి వెళ్లిపోయారు.

Related posts

Leave a Comment