ఐసీయూలో వాజ్ పేయి… ఎయిమ్స్ హెల్త్ బులెటిన్!

  • ఆయన ఆరోగ్యాన్ని గమనిస్తున్నాం
  • చికిత్సకు వాజ్ పేయి స్పందిస్తున్నారన్న వైద్యులు
  • ఎయిమ్స్ వద్ద భారీ బందోబస్తు

మూత్రపిండాలు,ఊపిరితిత్తుల సమస్యలతో నిన్న ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తూ, వాజ్ పేయికి ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వెల్లడించారు. చికిత్సకు వాజ్ పేయి స్పందిస్తున్నారని తెలిపారు. కాగా, శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిన వాజ్ పేయి పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఎయిమ్స్ వద్దకు బీజేపీ శ్రేణులు తరలివస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Related posts

Leave a Comment